: వ్యాపారస్తుల కన్నా ఉద్యోగులే బెటర్: బ్యాంకులు


స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారవేత్తలకన్నా నెలనెలా క్రమం తప్పకుండా జీతాలు అందుకునే ఉద్యోగులనే బ్యాంకులు నమ్మకస్తులుగా భావిస్తున్నాయని భారతదేశ ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తేల్చిచెప్పింది. వ్యాపారవేత్తలకు అందే ఆదాయంలో స్థిరత్వం ఉండదు కాబట్టి రుణాలు ఎగవేసే అవకాశాలు అధికమని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయి. వేతన జీవులకు నెలనెలా కచ్చితంగా సొమ్ము అందుతుంది, దీని ఫలితంగా రుణాల ఎగవేతకు తక్కువ అవకాశాలు ఉంటాయని బ్యాంకులు భావిస్తున్నాయి. అందుకే ఉద్యోగులకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ సంస్థ తెలిపింది. వేతన జీవులకంటే... వ్యాపారవేత్తలు రుణాల ఎగవేత అవకాశాలు 50 శాతం అధికంగా ఉన్నట్లు ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు... వ్యాపారవేత్తల రాబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇలాంటప్పుడు రుణాల ఎగవేతకు ఎక్కువ అవకాశాలున్నాయని వెల్లడించింది. వ్యాపారవేత్తల పట్ల ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉంటాయని, ఉద్యోగులకు అమలు చేసే వడ్డీ రేటు కంటే 0.5 శాతం అధికంగా అమలు చేస్తాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News