: నిత్యానందకు పురుషత్వ పరీక్షలు


వివాదాస్పద గురువు స్వామి నిత్యానందకు కష్టాలొచ్చిపడ్డాయి! ఆయనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఆగస్టు 6న నిత్యానంద పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి రావాల్సి ఉంటుందని నోటీసులు జారీచేశారు. నిత్యానందపై పలు కేసులు విచారణలో ఉండగా, ఓ కేసులో కర్ణాటకలోని రామనగర జిల్లా కోర్టు పురుషత్వ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాను ఆధ్యాత్మిక గురువునని, తనకు దేహపరమైన వాంఛలుండవని కోర్టుకు తెలిపారు. అయితే, హైకోర్టు నిత్యానంద పిటిషన్ కొట్టివేస్తూ, పురుషత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేగాకుండా, జులై 28 నుంచి నిత్యానందను కస్టడీలోకి తీసుకోవచ్చని సీఐడీకి సూచించింది.

  • Loading...

More Telugu News