: సముద్ర ప్రవేశం చేసిన ఆర్.వి.సింధుసాధన
సముద్ర పరిశోధనల కోసం రూపొందించిన ఆర్.వి.సింధుసాధన నౌక నేడు జలప్రవేశం చేసింది. విశాఖపట్నంలో జరిదిన ఓ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, జాతీయ సముద్ర పరిశోధన సంస్థ (ఎన్ఐఓ) డైరక్టర్ డాక్టర్ నక్వీ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, ఇస్రో మాదిరే ఎన్ఐఓ కూడా పరిశోధనల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. నక్వీ మాట్లాడుతూ, ఇప్పటివరకు మనకు సముద్ర పరిశోధనలకు తగిన నౌక అందుబాటులో లేదని, సింధుతో ఆ లోటు తీరిందని చెప్పారు.