: కొలీగ్ పై కన్నేసిన ఐఐఎం ప్రొఫెసర్


అతడో ప్రొఫెసర్. ప్రతిష్ఠాత్మక రాంచీ ఐఐఎంలో పాఠాలు చెప్పే ఆ ఆచార్యుడు గాడితప్పాడు. కొలీగ్ పై కాముక చేష్టలతో వేధింపులకు దిగాడు. ఇది భరించలేని ఆ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే... ససాధర్ బేరా రాంచీ ఐఐఎంలో కోర్ ఫ్యాకల్టీ మెంబర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న మరో మహిళా ఫ్యాకల్టీపై బేరా కన్నుపడింది. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఆమెను వేధించసాగాడు. ఇలా రెండునెలలుగా జరుగుతుండడంతో బాధితురాలు ఐఐఎం మేనేజ్ మెంట్ కు ఫిర్యాదు చేసింది. అయినా, అతడి ప్రవర్తనలో మార్పులేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ కీచక ప్రొఫెసర్ తప్పు చేసినట్టు తేలితే జరిమానాతో పాటు రెండేళ్ళ జైలుశిక్ష తప్పదని పోలీసులు అంటున్నారు.

  • Loading...

More Telugu News