: బ్రెజిల్ కొత్త కోచ్ దుంగా
బ్రెజిల్ మాజీ ఆటగాడు కార్లోస్ దుంగా బ్రెజిల్ పుట్ బాల్ కోచ్ గా ఎంపికయ్యాడు. 1994లో వరల్డ్ కప్ నెగ్గిన బ్రెజిల్ జట్టులో దుంగా సభ్యుడు. ఆ తర్వాత బ్రెజిల్ జట్టుకు 2006 నుంచి 2011 వరకు దుంగా కోచ్ గా వ్యవహరించాడు. మళ్లీ రెండోసారి కోచ్ గా ఎంపికవడం పట్ల దుంగా ఆనందం వ్యక్తం చేశాడు. సాకర్ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో బ్రెజిల్ జర్మనీ చేతిలో 7-1 తేడాతో దారుణ పరాజయం పాలవడంతో బ్రెజిల్ కోచ్ సొల్కారీ రాజీనామా చేశాడు.