: కేసీఆర్ తో సమావేశమైన విప్రో అధినేత


విప్రో సంస్థల అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఈ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో విప్రో సంస్థలను విస్తరిస్తామని ప్రేమ్ జీ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాదుతో తన అనుబంధం గురించి ఆయన కేసీఆర్ కు వివరించారు. వీరిద్దరి మధ్య చర్చల్లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం కూడా చర్చకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రేమ్ జీకి వివరాలు తెలిపారు. ప్రేమ్ జీ ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో కూడా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖలో విప్రో సంస్థ ఏర్పాటుకు సర్కారు నుంచి ఆయనకు ఎన్వోసీ లభించింది.

  • Loading...

More Telugu News