: పెళ్ళి చేసుకోమంటూ వేధిస్తున్న వ్యక్తిపై టీవీ యాంకర్ ఫిర్యాదు
ఆశిష్ బిష్ణోయ్ అనే వ్యక్తి పెళ్ళి చేసుకోవాలంటూ తనను వేధిస్తున్నాడని ఓ టీవీ యాంకర్ హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశిష్ తో తనకు గతంలో పరిచయం ఉందని, ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని పెళ్ళి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్ళికి ఒప్పుకోకపోతే చంపేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపింది. కాగా, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆశిష్ కు ఇంతకుముందు రెండు పెళ్ళిళ్ళు జరిగాయని తేలింది.