: టీమిండియాకు బ్రేకిచ్చిన షమీ
మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 56 పరుగులతో ఆడుతోంది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భారత్ కు బ్రేకిచ్చాడు. గుడ్ లెంగ్త్ ఏరియాకు దగ్గరగా పిచ్ చేసిన బంతిని ఆడబోయిన ఓపెనర్ శామ్ రాబ్సన్ (26) థర్డ్ స్లిప్ లో జడేజా చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఆలిస్టర్ కుక్ (30*), గ్యారీ బాలెన్స్ (0*) ఉన్నారు. ఈ మ్యాచ్ కు సౌతాంప్టన్ వేదిక.