: తిరుమలలో పెరిగిన రద్దీ... సండే ఎఫెక్ట్
తిరుమలలో ఈ సాయంత్రానికి రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఇక, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.