: ముంబయి పోలీస్ కమిషనర్ కు బెదిరింపు లేఖ


ముంబయిలో అప్రమత్తత ప్రకటించారు. నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాకు ఉగ్రవాదుల పేరిట ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఆ లేఖలో... "చేతనైతే ఈసారి చేసే దాడిని అడ్డుకోండి, 1993లో బతికిపోయావ్" అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై 'ముజాహిదిన్' అని ఉంది. ఈ లేఖను ఉత్తుత్తి బెదిరింపుగానే అనుమానిస్తున్నారు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ఉగ్రవాద వ్యతిరేక దళాలను అప్రమత్తం చేశారు. 1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్ళ దాటికి 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News