: ఈ నెల 27 వరకు శిల్పారామంలో డ్వాక్రాబజార్ మేళా
హైదరాబాదు హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామంలో ఏర్పాటైన డ్వాక్రాబజార్ మేళాలో ప్రదర్శిస్తున్న చేనేత వస్త్రాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ డ్వాక్రాబజార్ మేళాలో ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ మేళా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శిల్పారామం తెరచి ఉంటుంది.