: తెలుగుగంగతో తిరుమల దాహార్తిని తీరుస్తాం: దేవినేని ఉమ


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తాగునీటి సమస్యను తీర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తెలుగుగంగ నీటిని తిరుమలకు తరలించడం ద్వారా నీటి సమస్యే లేకుండా చేస్తామని తెలిపారు. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఎర్రచందనాన్ని వేలం వేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News