: శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు.