: కోల్ స్కాంలో నవభారత్ మాజీ డైరెక్టర్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
సంచలన బొగ్గు కుంభకోణం కేసులో ఈ రోజు ఈడీలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నవభారత్ ప్రమోటర్లకు చెందిన రూ.186.11 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో త్రివిక్రమ్ ప్రసాద్ కు చెందిన రూ. 138.59 కోట్ల వాటాలు, హరిశ్చంద్ర ప్రసాద్ కు చెందిన రూ. 36.32 కోట్ల విద్యుత్ జనరేటర్లు ఉన్నాయి. అంతేగాక నాదర్ గుల్ లోని రూ. 11.20 కోట్ల భూములను ఈడీ జప్తు చేసింది.