: స్కూల్ రోజుల్లో కబడ్డీ కూడా ఆడా: సచిన్
ముంబైలో జరిగిన ప్రో కబడీ లీగ్ ప్రారంభోత్సవానికి సచిన్ కుటుంబసమేతంగా హాజరయ్యాడు. ప్రో కబడీ లీగ్ కు మద్దతు తెలపడానికే తాను ఇక్కడకు వచ్చానని సచిన్ అన్నాడు. పాఠశాల స్థాయిలో తాను క్రికెట్, టెన్నిస్ తో పాటు కబడ్డీ కూడా ఆడానని సచిన్ తెలిపాడు. మళ్లీ ఇన్నాళ్లకు కబడ్డీ పోటీలు చూడటం చాలా ఆనందంగా ఉందని సచిన్ అన్నాడు. కబడ్డీ ఆటకు వేగం, చురుకుదనం, అప్రమత్తత చాలా ముఖ్యమని సచిన్ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో సచిన్ తో పాటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ తారల సందడితో తొలిరోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ప్రో కబడ్డీ లీగ్ లో విశాఖపట్టణానికి చెందిన తెలుగు టైటాన్స్ జట్టు కూడా పాల్గొంటుంది.