: ఉగ్రవాదుల్ని తట్టుకోలేకపోతున్న సిరియా సైనికులు... 85 మంది మృతి


సిరియా సైనికులు ఇస్లామిక్ ఉగ్రవాదుల ధాటికి ఎదురు నిలవలేకపోతున్నారు. సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకరపోరులో గత రెండురోజుల్లో 85 మంది సైనికులు మృతి చెందారు. సిరియాలోని ఉత్తరాది అల్ రక్కా ప్రావిన్స్లో హింస తారస్థాయికి చేరింది. ఉగ్రవాదులు బాంబులు, క్షిపణులతో సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడుతున్నారు. బాంబు దాడుల్లో సైనికులు, అధికారులు మరణిస్తున్నారు. కాగా, మరో 200 మంది సైనికుల ఆచూకీ లభించడం లేదు.

  • Loading...

More Telugu News