: జగన్ ఇంకా క్రిమినల్ మైండ్ తోనే ఆలోచిస్తున్నారు: వర్ల రామయ్య


వైఎస్సార్సీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లివచ్చినా మారలేదని, క్రిమినల్ మైండ్‌తోనే ఆలోచిస్తున్నారని టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... సాక్షి పత్రిక అసత్య రాతలతో చంద్రబాబుపై బురద జల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇవ్వని హామీలను కూడా ఆయన చెప్పినట్టు చిత్రీకరిస్తున్న సాక్షిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాజకీయనేత సాహసించని రీతిలో చంద్రబాబునాయుడు రూ.45 వేల కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేశారని వర్ల రామయ్య అన్నారు. దీనిని జగన్ తట్టుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. ఈడీ కేసులో జగన్ మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన జగన్ కు సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News