: ఐఎస్ బీలో కొత్త కోర్సును ప్రారంభించిన కేటీఆర్


హైదరాబాదు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో కొత్తగా ప్రవేశపెట్టిన టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోర్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశ్రమల స్థాపనను కెరీర్ గా ఎంచుకునేందుకు వీలుగా ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఐఎస్ బీ డీన్ రంగునేకర్ మాట్లాడుతూ... పరిశ్రమలు స్థాపించేటప్పుడు లాభాలను పక్కనపెట్టి ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డు కార్యదర్శి హెచ్.కె.మిట్టల్, ఐఏఎస్ ఆఫీసర్ హర్ ప్రీత్ సింగ్, మొహలీ ఐఎస్ బీ క్యాంపస్ డిప్యూటీ డీన్ ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News