: వాజేడు వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం మధ్యాహ్నం 28 అడుగులున్న గోదావరి నీటిమట్టం... ఇవాళ మధ్యాహ్నానికి 34 అడుగులకు చేరింది. గోదావరి వరద పోటెత్తడంతో చీకుపల్లి వాగు కాజ్ వే పై 7 అడుగులకు పైగా వరద నీరు చేరింది. దీంతో 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు చీకుపల్లి వాగు కాజ్ వేను దాటేందుకు వీలుగా రెవెన్యూ అధికారులను పడవలను ఏర్పాటు చేశారు.