: నిధులను ఖర్చు చేయడంలో బీబీఎంపీ తర్వాత ఎవరైనా..!


నిధులను ఖర్చు చేయడంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) స్టయిలే వేరు. ఇటీవలే ఎలుకలు పట్టేందుకు లక్షలు ఖర్చు పెట్టి వార్తల్లోకెక్కిన బీబీఎంపీ తాజాగా ఓ థీమ్ సాంగ్, షార్ట్ ఫిల్మ్ కోసం రూ.23.6 లక్షలు ఖర్చు చేయడం విశేషం. 'నమ్మ బెంగళూరు, నమ్మ కొడుగే' అంటూ సాగే ఈ గీతాన్ని నిధుల సేకరణ కోసం రూపొందించారట. ఈ పాట చిత్రీకరణ బాధ్యతలను మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అండ్ ఏజెన్సీస్ లిమిటెడ్ (ఎంసీఏఎల్) కు అప్పగించింది బీబీఎంపీ. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా బెంగళూరు నగరం మెట్రోపాలిటన్ గా ఎలా ఎదిగిందన్న విషయాన్ని కళ్ళకుకట్టనున్నారు.

  • Loading...

More Telugu News