: రాత్రివేళ లైట్లు బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నిద్రలేపుతాయట!


రాత్రి సమయాల్లో ఎక్కువమంది లైట్లు ఆర్పి పడుకొనేందుకే ఇష్టపడతారు. మరికొందరికి లైట్లు ఉంటేనే నిద్రపడుతుంది. అయితే, ఈ లైట్ల కాంతికి బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు మేలుకుంటాయట. తద్వారా క్యాన్సర్ వ్యాధి మరింతగా విస్తరించే అవకాశం ఉందని అమెరికాలోని టులాన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... క్యాన్సర్ కణుతుల తయారీని అడ్డుకునే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి లైట్ల వెలుగులో నిలిచిపోతుంది. దీంతో, రొమ్ము క్యాన్సర్ కణాలు మరింతగా చెలరేగిపోతాయని, అప్పుడవి క్యాన్సర్ ఔషథం టామోక్సిఫెన్ ను సైతం తట్టుకోగలిగే శక్తిని సముపార్జించుకుంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకల్లో రొమ్ము క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టి ఈమేరకు ప్రయోగాలు నిర్వహించారు. క్యాన్సర్ చికిత్సలో టామోక్సిఫెన్ ఔషథాన్ని వాడే మహిళలు రాత్రివేళ లైట్లు ఆపి నిద్రిస్తేనే మంచిదని వర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. నైట్ షిఫ్టుల్లో ఉద్యోగాలు చేసేవారు, రాత్రివేళ టీవీలు, కంప్యూటర్ల ముందు కూర్చునే వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సదరు పరిశోధన చెబుతోంది.

  • Loading...

More Telugu News