: హమ్మయ్యా... సెల్ దొంగల్ని ఇకపై ఇలా పట్టేయొచ్చు!


సెల్ ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. ఏది లేకపోయినా ఫర్వాలేదు కానీ, సెల్ ఫోన్ లేకపోతే కనుక జీవితం మొత్తం కోల్పోయిన ఫీలింగ్ లో పడిపోతున్నామని సర్వేలు చెబుతున్నాయి. సెల్ లేనిదే కొంత మందికి పూట గడవదంటే అర్థం చేసుకోవాలి, సెల్ ఎంత దగ్గరి బంధువో... అలాంటి సెల్ ను దొంగలెత్తుకుపోతే ఆ భాధ వర్ణనాతీతం. దీనికి విరుగుడు కనిపెట్టారు అమెరికా పరిశోధకులు. 'లుక్ అవుట్' అనే యాప్ ను తయారు చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ మీ సెల్ లో ఉంటే దొంగతనం చేసే వాళ్ల ఫోటోలు, దొంగతనం చేసిన ప్రదేశాన్ని ఫోటోతీసి యజమానికి ఈ-మెయిల్ చేస్తుంది. వాటి సాయంతో గంటల్లో దొంగను పట్టేయొచ్చునన్నమాట. ఇలా అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక మహిళకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడింది. ఒక దొంగ ఆమె కారు నుంచి చాకచక్యంగా సెల్ ఫోన్ ను దొంగతనం చేసింది. దొంగ ఫోన్ అన్ లాక్ చేయడానికి ప్రయత్నించగానే ఆ యాప్ అలెర్టై ఆమె ఫోటో తీసింది. వెంటనే ఆ లొకేషన్ ఫోటో తీసింది. వెంటనే ఆ ఏరియా మ్యాప్ డౌన్ లోడ్ చేసి యజమాని మెయిల్ కు పంపింది. ఆ వివరాలను సదరు యజమాని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో వేలాది మంది ఆ ఫోటోలు, వివరాలు షేర్ చేసుకున్నారు. దాంతో దొంగ దొరికిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ మరిచిపోయేవారికి ఆ యాప్ ఎంతో సహాయకారి కాగా, దొంగల పాలిట మాత్రం శాపంగా మారనుంది.

  • Loading...

More Telugu News