: నాటు తుపాకీ పేలి గాయపడిన మహిళ
అంకన్నగూడెంలో నాటుతుపాకీ పేలడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన సోయందుర్గ అనే మహిళను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి... దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.