: అనంతపురం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి రూ.11 కోట్ల నిధులు: ఎంపీ జేసీ
అనంతపురం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అనంతపురంలో ఏర్పాటు కాదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్న దివాకర్ రెడ్డి, కేంద్రం సహకారంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు.