: అది మా డ్రీమ్ ప్రాజెక్టు: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్నది తమ డ్రీమ్ ప్రాజెక్టు అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అంతేగానీ, అందరూ అనుకుంటున్నట్టు ఉచిత విద్య అనేది ఎన్నికల కోసం ఇచ్చిన నినాదం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాణ్యమైన విద్య ప్రభుత్వపరంగానే అందుతోందని అన్నారు. దేశంలోనే విప్లవాత్మక విద్యా వ్యవస్థగా రాష్ట్రం రూపొందుతోందని మంత్రి చెప్పారు.