: విమాన ప్రయాణికులను రోడ్డు బాట పట్టించిన గ్రద్ద
నేడు రాజమండ్రిలో స్పైస్ జెట్ విమానానికి ముప్పు తప్పింది. ఓ గ్రద్ద ఇంజిన్ ను ఢీకొట్టడంతో విమానాన్ని నిలిపివేశారు. రాజమండ్రి నుండి ఈ విమానం హైదరాబాద్ రావాల్సి ఉంది. సర్వీసు రద్దు కావడంతో కొందరు ప్రయాణికులను రోడ్డు మార్గం ద్వారా గన్నవరం పంపారు. మరికొందరు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక్కడి మధురపూడి ఎయిర్ పోర్టులో ప్లేన్ టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ గ్రద్ద విమానం రెక్కకు తగిలింది. దీంతో ఆ పక్షికి చెందిన భాగాలు ఇంజిన్ లో ఇరుక్కుపోయాయి. దాంతో, ఎయిర్ పోర్టు అధికారులు ఇంజినీర్లను పిలిపించారు.