: టీడీపీని దెబ్బతీసేందుకే రాష్ట్రాన్ని విభజించారు: చంద్రబాబు
కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని... ఈరోజు హైదరాబాదు నుంచి ఇంత ఆదాయం రావడానికి తామే కారణమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతురుణాలను మాఫీ చేసి చూపించామని... మాటకు కట్టుబడ్డామని తెలిపారు. ఈ రోజు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున లేక్ వ్యూ అతిథి గృహానికి తరలి వచ్చి... రుణమాఫీ చేసినందుకు చంద్రబాబును అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.