: ప్రాక్టీసు వదిలేసి కోచింగ్ సెంటర్లు నడుపుతున్న డాక్టర్లు
రాజస్థాన్ లోని కోట పట్టణంలో ఇప్పుడు వైద్య ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు ఎక్కువయ్యాయి. అయితే, అ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తోంది అక్కడి వైద్యులే కావడం విశేషం. ఇందుకు వారు చెబుతున్న కారణం ఒక్కటే... ఆర్థిక సంతృప్తి! కోట మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, పట్టణంలో మంచి వైద్యుడని పేరు తెచ్చుకున్న డాక్టర్ విపిన్ యోగి రెండేళ్ళ క్రితం వైద్య వృత్తిని వదిలేసి కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఆయన ఏమంటున్నారో వినండి... "నేను వైద్య వృత్తిలో పదేళ్ళలో సంపాదించే మొత్తాన్ని కోచింగ్ ద్వారా ఒక్క ఏడాదిలో కళ్ళచూడగలుగుతున్నాను. కేవలం ఏడెనిమిది గంటలు పనిచేస్తే సరిపోతుంది, పైగా, కుటుంబానికీ ఎంతో సమయం కేటాయించవచ్చు" అని వివరించారు. ఇక, భోధన బాట పట్టిన మరో వైద్యుడు సౌరభ్ వైష్ణవ్ మాట్లాడుతూ, ఇప్పటికీ తానేమీ ప్రాక్టీసు మానలేదని, విద్యార్థులెవరైనా అనారోగ్యం పాలైతే వారికి మందులు రాసిస్తుంటానని చమత్కరించారు.