: సానియా మీర్జాకు గాయని ఆశా భోంస్లే బాసట
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నియమించడంపై రాజకీయ వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ గాయని ఆశా భోంస్లే స్పందించారు. "సానియాను అనవసర వివాదంలోకి లాగారు. నన్నూ కూడా ఓ రాజకీయ నేత ఇలాగే జాతి వ్యతిరేక వివాదంలోకి లాగారు. నాకు చాలా తమాషాగా అనిపించింది" అంటూ ఆశా ట్విటర్లో పోస్టు చేశారు. అటు నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ కూడా సానియాకు మద్దతు తెలిపారు.