: శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఎస్ మంత్రి జోగు రామన్న
తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వరుడి విగ్రహానికి భార్యాసమేతంగా తైలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా క్షేమంగా ఉండాలని శనీశ్వరుడిని కోరుకున్నట్టు తెలిపారు.