: తమిళనాడు లాయర్లకు నల్లగౌన్ల బాధ తప్పింది!


తమిళనాడు న్యాయవాదులకు ఊరట. అక్కడి దిగువ (సబార్డినేట్) కోర్టుల్లో వాదించే లాయర్లు వేసవిలో నల్లగౌన్లు, కోట్లు ధరించాల్సిన అవసరంలేదట. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు మహిళా న్యాయవాదుల సమాఖ్య (టీఎన్ఎఫ్ డబ్ల్యూఎల్) తాము వేసవిలో నల్లగౌన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇటీవలే బీసీఐకి విన్నవించుకుంది. ఈ విషయమై టీఎన్ఎఫ్ డబ్ల్యూఎల్ అధ్యక్షురాలు కె.శాంతకుమారి జూన్ 2న బీసీఐకి ఓ లేఖ రాశారు. దీనిపై లోతుగా చర్చించిన బీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచి జులై వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. దీనిపై శాంతకుమారి మాట్లాడుతూ, మండే ఎండల్లో కిక్కిరిసినట్టుంటే కోర్టు హాల్లో తాము చెమటలు కక్కుతూ వాదించలేకున్నామని వాపోయారు.

  • Loading...

More Telugu News