: నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న శివరామకృష్ణన్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానుంది. రాయలసీమలో పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రితో కమిటీ భేటీ కాలేదని... ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతోందని మంత్రి పి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న 500 ఏళ్ల వరకు సుస్థిరంగా ఉండేలా రాజధానిని ఏర్పాటు చేయడానికి 25-30 వేల ఎకరాలు అవసరమని చెప్పారు. ఆగస్టు నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం సూచించిందని... తాము మాత్రం ఆగస్టు 20 లోగానే నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు.

  • Loading...

More Telugu News