: బాసరలో స్కూలు పెట్టాలని ఉంది... కేసీఆర్ తో చర్చిస్తా: మోహన్ బాబు
ఆదిలాబాద్ జిల్లా బాసరలో వెలసిన సరస్వతీ అమ్మవారి దేవాలయాన్ని సినీనటుడు మోహన్ బాబు నిన్న దర్శించుకున్నారు. తన మనవరాళ్లు (విష్ణు కుమార్తెలు) అరియానా, వివియానాలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆయన కుటుంబసమేతంగా బాసర విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాసరలో అన్ని సౌకర్యాలతో కూడిన స్కూలు పెట్టాలని ఉందని... ఈ విషయంపై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తానని చెప్పారు.