: మూడో టెస్టుకు రోహిత్ శర్మ, గంభీర్?
ఐదుగురు బౌలర్ల వ్యూహం తొలి రెండు టెస్టుల్లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో... టీమిండియా మూడో టెస్టు కోసం ప్రణాళికలు మారుస్తోంది. నలుగురు బౌలర్లు, ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్ తో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ క్రమంలో, బౌలర్ గా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన స్టువర్ట్ బిన్నీని తప్పించి, రోహిత్ శర్మను మూడో టెస్టు కోసం తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ కూడా నెట్స్ లో ప్రాక్టీసు జోరు పెంచాడు. దీంతో, రోహిత్ మూడో టెస్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ ధావన్ ప్లేస్ లో గంభీర్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.