: వరుసగా నిలబెట్టి బుల్లెట్ల వర్షం కురిపించిన కిరాతకుడు
తాలిబన్ ఉగ్రవాది 15 మందిని అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఘోర్ ప్రావిన్స్ లో ఓ రహదారి వద్ద రెండు వాహనాల వద్దకు వెళ్లి, వాటిలో ప్రయాణిస్తున్న వారికి తన వద్దనున్న తుపాకీ చూపి బెదిరిస్తూ కిందికి దిగమని ఆదేశించాడు. అందరూ కిందకి దిగిన తరువాత వారందరినీ వరుసగా నిలబెట్టి తల, ఛాతిపై బుల్లెట్ల వర్షం కురిపించి, చంపేశాడని ఘోర్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ హాయ్ కతిబీ తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.