: మా ఊళ్లో రైల్వే గేటును పెట్టండి సారూ!
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద రైలు స్కూల్ బస్సును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోనూ రైల్వే గేటును ఏర్పాటు చేయాలని కృష్ణాజిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాలోని ఉంగుటూరు మండలం వేంపాడులో రెండు చోట్ల రైల్వే లెవెల్ క్రాసింగులున్నాయి. రెండు చోట్ల రైల్వే గేట్లు లేవు. ఈ లెవెల్ క్రాసింగ్స్ నుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయ. తమ గ్రామంలోనూ రైల్వే గేటును ఏర్పాటు చేయాలని వేంపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రైల్వే శాఖకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా... రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.