: వానలు, వరదలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి


గోదావరి నది పుట్టిన మహారాష్ట్రలో వానలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు పొంగి వరదనీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో జలకళను సంతరించుకున్న గోదావరిని చూస్తుంటే... ప్రజలకు ఓ పక్క ఆనందం వేస్తున్నా, మరో పక్క వరదల భయం కలుగుతోంది. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి 37 అడుగులతో ప్రవహిస్తోంది. దీంతో చీకుపల్లి కాజ్ వే పైకి 10 అడుగుల మేర వరదనీరు చేరింది.

  • Loading...

More Telugu News