: అత్యంత కిరాతకుడు... మేకను దొంగిలించాడని బాలుడి చేతులు నరికేశాడు!


కంటికి కన్ను, పంటికి పన్ను అనేది కొన్ని మతాలు ఆచరించే సిద్ధాంతం. అయితే ఆ వ్యక్తికి ఆ సిద్ధాంతం గురించి తెలుసో తెలియదో కానీ... తన మేకను దొంగిలించాడనే నెపంతో పదేళ్ల బాలుడి రెండు చేతులు నరికేశాడో కామందు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో లోహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజ్ రాత్ జిల్లా చాక్ బోలు గ్రామానికి చెందిన భూస్వామి ముస్తాఫా గౌసఫ్ మేకను తబస్సుమ్ అనే బాలుడు దొంగిలించాడని నిర్ధారించుకున్నాడు. ఈ నెల 21న తబస్సుమ్ ను ముస్తఫా గౌసఫ్ ఎత్తుకుపోయి బాలుడి చేతులు తెగేవరకు పంపింగ్ మెషీన్ లో పెట్టాడు. తీవ్ర రక్తస్రావమవుతున్న తబస్సుమ్ ను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. విషయం బాలుడి తండ్రి నాసిర్ ఇక్బాల్ కు తెలియడంతో హుటాహుటిన తన కుమారుడ్ని ఆసుపత్రికి తరలించాడు. ముస్తాఫా గౌసఫ్ కిరాతకం గురించి పాక్ మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించడంతో పంజాబ్ సీఎం షహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. అసుపత్రిలో చికిత్స పొందుతున్న తబస్సుమ్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పడంతో ముస్తాఫాను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో హత్యానేరంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముస్తాఫాను అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. అతడికి సెషన్స్ కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News