: నేను భారతీయురాలినని ఎన్నిసార్లు నిరూపించుకోవాలి?: కన్నీరు పెట్టిన సానియా


‘నేను గెలిస్తే దేశానికి గర్వకారణమని పండుగ చేస్తారు. భారతీయ మహిళ అని అందరూ కీర్తిస్తారు. కానీ నేను భారతీయురాలినని ఎందుకు గుర్తుంచుకోరు? పాకిస్థాన్ కోడలినని అంటారెందుకు?’ అంటూ సానియా మీర్జా కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టవని తెలిపింది. తన తాత, తండ్రుల నుంచి అంతా హైదరాబాదీలని... తాను భారతీయురాలినని, తెలంగాణ వ్యక్తినని సానియా స్పష్టం చేసింది. షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్నప్పడు కూడా అతను ఏ దేశానికి చెందిన వాడని చూడలేదని సానియా పేర్కొంది. టెన్నిస్ అకాడమీ పెట్టి దేశానికి, రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నానని సానియా తెలిపింది. విమర్శలు వచ్చిన ప్రతిసారీ తాను మరింత మానసిక దృఢత్వాన్ని సంతరించుకుంటానని చెప్పింది. తనకు భర్త, కుటుంబ సభ్యుల అండ ఉందని, మీడియా కూడా తనకు వెన్నుదన్నుగా నిలుస్తోందని సానియా వివరించింది. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత భారతదేశం తరపునే తాను టెన్నిస్ ఆడానని సానియా గుర్తు చేసింది. తాను ఎవరిని పెళ్లి చేసుకున్నానన్న విషయం ఇప్పటికీ చూడడం లేదని సానియా పేర్కొంది.

  • Loading...

More Telugu News