: పబ్లిసిటీ కోసమే రంభపైన, నాపైన ఆరోపణలు: రంభ సోదరుడు
అదనపుకట్నం కోసం వేధిస్తున్నారంటూ సినీ నటి రంభ, ఆమె సోదరుడు శ్రీనివాసరావు, తల్లిదండ్రులపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న (మంగళవారం) కేసు నమోదైన సంగతి తెలిసిందే. రంభ సోదరుడి భార్య పల్లవి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీనిపై రంభ సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి ఆరోపణలు చేస్తోందన్నారు. రంభపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబ సభ్యులే వెనకుండి ఆమెతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.