: స్థూలకాయం, మధుమేహ వ్యాధులకు సంబంధమున్న వైరస్ దొరికింది...పరిష్కారమే తరువాయి!
ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా స్థూలకాయం, మధుమేహం వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థూలకాయం, మధుమేహ వ్యాధులను నయం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అదుపులోకి రావడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. అమెరికా శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ బయో ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ బృందం మధుమేహం, స్థూలకాయం వ్యాధులకు కారణమైన వైరస్ ను కనుగొన్నారు. మూల కణాల, డీఎన్ఏ నమూనాలను సేకరించి పరిశోధనలు చేస్తుండగా ఊహించని విధంగా కాస్ప్రేజ్ అనే అత్యంత పురాతనమైన వైరస్ కంటబడిందని తెలిపారు. ఈ వైరస్ కూ స్థూలకాయం, మధుమేహానికీ సంబంధం ఉందని స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ పరిశోధనలు ఫలిస్తే మధుమేహానికి, స్థూలకాయానికి గల సంబంధం, వైరస్ నిర్మూలనకు పరిష్కారం లభించనట్టేనని పేర్కొంటున్నారు. అంతే కాకుండా మానవ జాతి మనుగడలో మిగిలిపోయిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా లభించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.