: కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలివే...!
ఢిల్లీలో సమావేశమైన కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ గైడ్ లైన్స్ ను వెబ్ సైట్లో ఉంచారు. గైడ్ లైన్స్ లోని ప్రధానాంశాలివే... ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ఒకసారి ఇచ్చిన ఆప్షన్ ను మార్చుకునే అవకాశం మాత్రం లేదు. ఏడేళ్ల విద్యాభ్యాసం ఆధారంగానే స్థానికతను నిర్ధారించడం జరుగుతుంది. దంపతులు, ఒంటరి మహిళల ఆప్షన్లకు ముందుగా ప్రాధాన్యమిస్తారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఆప్షన్లు లేవు.