: పార్లమెంటులో ప్రధానిని కలసిన టీడీపీ, బీసీ సంఘాల నేతలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీని టీడీపీ, బీసీ సంఘాల నేతలు ఈ రోజు పార్లమెంటులో కలిశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు మోడీకి వినతిపత్రం సమర్పించారు.