: ఆ గజదొంగ పారిపోయాడా... పోలీసులే తప్పించారా?
పోలీస్ స్టేషన్ నుంచి ఓ గజదొంగ తప్పించుకుని పారిపోయాడు. అయితే అతను తప్పించుకుని పరారయ్యాడా? లేక పోలీసులే తప్పించారా? అన్నది ఇంకా తేలలేదు. ఎందుకంటే, పోలీసులే అతని నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుని తప్పించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.