: ఓయూలో ఇంకా ఆరని 'కాంట్రాక్టు' జ్వాలలు
ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓయూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నేడు కూడా నిరసనకు దిగిన విద్యార్థులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భిక్షాటన చేసి సర్కారు నిర్ణయంపై తమ వ్యతిరేకతను చాటారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని, తమ ఉపాధికి భంగం వాటిల్లేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదని వారు పేర్కొన్నారు.