: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల పంపిణీపై విధివిధానాలు ఖరారు
ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన కమలనాథన్ కమిటీ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల పంపిణీపై విధివిధానాలను కమిటీ ఈ రోజు ఖరారు చేసింది. రెండు రోజుల్లో వీటిని వెబ్ సైట్ లో ఉంచుతామని, అభ్యంతరాలుంటే పది రోజుల్లోగా తమకు చెప్పాలని కమిటీ వెల్లడించింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందన్న కమిటీ, ఆర్టికల్ 371 డీ ప్రకారం స్థానికత నిర్ధారిస్తామని తెలిపింది. ఒకట్రెండు ఏళ్లల్లో పదవీ విరమణ పొందే వారికి ఆప్షన్లు లేవని... దంపతులు, ఒంటరి మహిళా ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని కమిటీ పేర్కొంది. ఈ సమావేశానికి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు.