: కార్గిల్ అమరులకు ఆర్మీ చీఫ్ నివాళి
కార్గిల్ యుద్ధం సందర్భంగా అమరులైన భారత జవాన్లకు నేడు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. నేడు విజయ్ దివస్ దినాన్ని పురస్కరించుకుని ఆర్మీ చీఫ్ బిక్రమ్ సింగ్ ఢిల్లీలోని అమరజవాన్ల స్మారక స్థలి 'వీర్ స్మృతి' వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడగలిగే సత్తా భారత సైన్యానికుందని పేర్కొన్నారు. సైన్యం ఎలాంటి సవాళ్ళకైనా సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, బిక్రమ్ సింగ్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.