: రంజాన్ పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ముందుగానే జీతాలు


పవిత్ర రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు నేడు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అటు ముందుగా జీతాలు చెల్లించాలంటూ టి గెజిటెడ్ అధికారుల సంఘం ఛైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ పీఆర్టీయూ, మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ఆయన అంగీకారం తెలిపారు. దీంతో, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఆరు రోజులు ముందుగానే జీతాలు అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News