: మిలిటెంట్లపై పాక్ జెట్ ఫైటర్ల మెరుపుదాడి


పాకిస్థాన్ మరోసారి మిలిటెంట్లపై విరుచుకుపడింది. ఈ ఉదయం పాక్ వైమానిక దళం నార్త్ వజీరిస్తాన్ ప్రాంతంలోని తీవ్రవాద స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఈ దాడుల్లో 13 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఆరు తీవ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా, కరాచీ ఎయిర్ పోర్టుపై జూన్ 8న తాలిబాన్లు దాడి చేయడంతో పాక్ సర్కారు తీవ్రంగా స్పందించింది. వెంటనే జూన్ 15న ఆపరేషన్ జర్బ్-ఐ-అజబ్ పేరిట మిలిటెంట్లపై దాడులకు శ్రీకారం చుట్టింది. ఈ దాడుల ఫలితంగా ఉత్తర వజీరిస్తాన్ గిరిజన ప్రాంతం నుంచి 9 లక్షల మంది ఇళ్ళను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు.

  • Loading...

More Telugu News