: కామన్వెల్త్ లో తొలి బంగారు పతకం సాధించిన ఇంగ్లండ్
గ్లాస్గోలో జరుగుతోన్న 20వ కామన్వెల్త్ క్రీడల్లో తొలి బంగారు పతకాన్ని ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ దేశానికి చెందిన జోడి స్టంప్సన్ ట్రై అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించారు. కెనడాకు చెందిన కిర్ స్టన్ స్వీట్ లాండ్ రజత పతకం సాధించగా, ఇంగ్లండ్ కు చెందిన విక్కీ హోలాండ్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.